
జనరల్

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకు అందిన సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 గదులు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథిగృహం మీదుగా శిలాతోరణం వలయం వరకు విస్తరించింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఆరు గదుల్లో సమయ నిర్దేశిత దర్శన భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు నమోదు కాగా, బుధవారం 72,362 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 29,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!