
క్రీడలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భారీగా భక్తుల రద్దీ నెలకొంది. కొండపై పార్కింగ్ పూర్తిగా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. భక్తుల రద్దీ కారణంగా కొండపైకి వెళ్లే మార్గాల్లో కూడా తీవ్ర రద్దీ కనిపించింది.
కింద పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆలయానికి వెళ్లేందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడుచుకుంటూ వెళ్లాలన్నా కొన్ని ప్రాంతాల్లో మెట్ల దారి సౌకర్యం లేకపోవడం సమస్యగా మారింది. కనీసం సెలవు రోజుల్లో అయినా అదనపు బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులను కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!