
బిజినెస్

అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు కావట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో సుమారు 23 వేల మంది రైతులకు రుణమాఫీ అందలేదని, ప్రభుత్వం జారీ చేసిన జీవో పూర్తిగా అమలుకావట్లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రుణమాఫీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు.
ఈ అంశంపై విచారణలో ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇది ప్రజాప్రయోజన సమస్య కాబట్టి పిల్‌గా దాఖలు చేయాలని సూచించారు. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజలకు సంబంధించిన సమస్య అయితే పిల్‌గా దాఖలు చేయాలని సూచించడంతో, హరీశ్‌రావు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!