
షోస్

జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ) రష్పాల్ సింగ్, బాబీ చంద్ల మృతదేహాలను డంపర్ ట్రక్కులో తరలించడం వివాదానికి దారితీసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి తగిన గౌరవం ఇవ్వకుండా ఇలా తరలించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే షాగున్ పరిహార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమరవీరులకు తగిన గౌరవం దక్కలేదని ఆరోపిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారిని అవమానించడమేనని విమర్శించారు. మరోవైపు, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!