

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అఖిల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి నాగార్జున ప్రతిష్టాత్మక ‘కింగ్100’ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. షూటింగ్ చాలా నిశ్శబ్దంగా జరుగుతుండటంతో ఎలాంటి అప్డేట్లు రాకపోవడం గురించి ప్రశ్నించగా అఖిల్ స్పందించాడు.
అఖిల్ మాట్లాడుతూ, నాగార్జున ‘కింగ్100’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నారని తెలిపాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని, ఆయన కెరీర్‌లోనే ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పటికే ఉన్న బజ్ మరింత పెరిగి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!