

కరునాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ చిత్ర టీజర్ విడుదలైంది. దర్శకుడు హేమంత్ ఎం రావు రూపొందించిన ఈ స్పై డ్రామా టీజర్‌ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వైశాక్ జె గౌడతో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. టీజర్‌లో గూఢచారి మిషన్, ఏజెంట్ల మధ్య సంఘర్షణలు, భావోద్వేగాలు, ముసుగు ధరించిన వ్యక్తి పాత్ర వంటి అంశాలను అద్భుతంగా చూపించారు. లెజెండరీ డా. రాజ్‌కుమార్ ‘సీఐడీ 999’కు నివాళిగా టీజర్ రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ ఏజెంట్ ప్రకాష్ పాత్రలో ఆకట్టుకోగా, ధనంజయ పాత్ర చివర్లో మలుపుతో ఆసక్తిని పెంచింది. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం, విశ్వాస్ కశ్యప్ రూపొందించిన సెట్లు, చరణ్ రాజ్ సంగీతం టీజర్‌కు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకువచ్చాయి. హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవికత, భావోద్వేగాలతో ప్రేక్షకులను మెప్పించనుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ఏడాది విడుదల కానున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!