

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో హర్ష రోషన్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాడు. లెజెండరీ దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ స్థాపించిన ఈవీవీ బ్యానర్‌పై ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్, నిర్మాత ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో హర్ష రోషన్ సరసన ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంతో రూపొందుతున్న ఈ ప్రేమకథ తాజాగా శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బలమైన కథనం, వాస్తవికతతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!