
జనరల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తన నుంచి డబ్బులు తీసుకున్నారని, అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే తనకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించారని కూడా ఆమె ఆరోపించింది.
యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!