
సినిమాలు

తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను న్యూఢిల్లీలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు మరిన్ని గ్రామీణ గృహాలను కేటాయించాలని వారు కేంద్ర మంత్రిని కోరారు.
అదేవిధంగా, ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన (PMGSY) కింద రాష్ట్రంలోని పలు గ్రామీణ రహదారులను మంజూరు చేసి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై కూడా మంత్రితో చర్చించారు. కాగా, ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కూడా పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద తెలంగాణకు 11.50 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!