

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 15.5 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెరిగింది. ఒకే రోజులో ఇంత భారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్న తొలి లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. గతంలో ఎన్విడియా నెలకొల్పిన 441 బిలియన్ డాలర్ల రికార్డును అధిగమించింది.
మైక్రోసాఫ్ట్ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన అద్భుతమైన త్రైమాసిక ఫలితాలే. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా అజూర్ క్లౌడ్ సేవలు అంచనాలను మించి వృద్ధి నమోదు చేయడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది.
అజూర్ క్లౌడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగి తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అధిగమించింది. మైక్రోసాఫ్ట్ మొత్తం క్లౌడ్ వ్యాపారం కూడా 200 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. జూలై 30 నాటి ర్యాలీ తర్వాత కంపెనీ మార్కెట్ విలువ సుమారు 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!