

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న 'హర్ ఘర్ లఖ్‌పతి' రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పథకం క్రమం తప్పకుండా పొదుపు చేసే వారికి మంచి అవకాశంగా నిలుస్తోంది. ఈ పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ లక్ష్య మొత్తాన్ని ఎంచుకోవచ్చు. 3 నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా, వ్యక్తిగత, జాయింట్, అర్హత కలిగిన మైనర్ల పేర్లతో కూడా ఖాతా తెరవవచ్చు.
ఎస్‌బీఐ అధికారిక పట్టిక ప్రకారం 10 సంవత్సరాల కాలానికి నెలకు రూ.610 చెల్లిస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.1 లక్ష పొందవచ్చు. అదే లక్ష్యానికి 3 సంవత్సరాల కాలానికి నెలకు రూ.2,510, 5 సంవత్సరాలకు రూ.1,420, 7 సంవత్సరాలకు రూ.960 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం సాధారణ ఖాతాదారులకు 3–4 సంవత్సరాల కాలానికి 6.55 శాతం, 5–10 సంవత్సరాలకు 6.30 శాతం వడ్డీ అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీ విధించబడుతుంది. వరుసగా ఆరు వాయిదాలు చెల్లించకపోతే ఖాతా మూసివేసే అవకాశం ఉంది. ముందస్తుగా డబ్బు తీసుకుంటే కూడా నిబంధనల ప్రకారం జరిమానా వర్తిస్తుంది. వడ్డీపై ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయి. అవసరమైన కేవైసీ పత్రాలతో ఎస్‌బీఐ శాఖలు లేదా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!