
జనరల్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సంస్కరణలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
ఎన్‌టీఏ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు కఠిన భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ అనంతరం ఎన్‌టీఏ, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!