

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6’ (GTA 6) విడుదలతో సందడి మొదలైంది. దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వచ్చిన ఈ గేమ్ కోసం అభిమానులు సెలవులు పెట్టుకుని మరీ ఆడుతున్నారు. ఈ క్రేజ్ అమెరికా సైనికులనూ తాకింది. జార్జియాలోని యూఎస్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ఇంజినీర్ బెటాలియన్ తమ సైనికులకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. GTA 6 ఆడేందుకు వరుసగా నాలుగు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు కావాలనుకునే వారు అదనంగా రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు సర్వీసు కొనసాగించాలని షరతు విధించింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబరు 14 వరకు అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌కు బెటాలియన్‌లోని 130 మంది అర్హులైన సైనికుల్లో 43 మంది అంగీకరించి ఒప్పందంపై సంతకాలు చేశారు.
లెఫ్టినెంట్ కల్నల్ ఏంజెల్ టోమ్కో వెల్లడించిన వివరాల ప్రకారం.. సైనికుల ర్యాంకులను బట్టి అదనపు సర్వీసు కాలం రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉంటుంది. ఈ సమయంలో వారికి బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కొనసాగుతాయి. నైపుణ్యం కలిగిన సైనికులను మరింతకాలం ఆర్మీలో కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 2013లో GTA 5 విడుదలైనప్పటి నుంచి తదుపరి ఎడిషన్ కోసం గేమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన GTA 6కు భారీ స్పందన లభిస్తోందని, ఇప్పటికే 2.45 కోట్ల కాపీలు అమ్ముడైనట్లు నివేదిక పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!