
క్రీడలు

పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా ఇజ్రాయెల్ హత్యాయత్నాలు చేయవచ్చన్న వార్తలు వెలువడటంతో తీవ్ర చర్చ జరిగింది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఖండించింది. అమెరికా మీడియా ప్రచురించిన కథనాలు అవాస్తవమని, కల్పిత సమాచారం ఆధారంగా రాసినవని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.
అమెరికా–ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబఫ్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. అయితే ఖతార్‌లో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని, తదుపరి విడత చర్చలు త్వరలో జరగనున్నాయని సమాచారం. ఈ వార్తలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!