
క్రీడలు

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వినియోగదారులు తమ eKYC ప్రక్రియను 2026 జూన్ 30లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎల్‌పీజీ సబ్సిడీల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఈ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు హెచ్చరించారు. గడువు తేదీలోపు eKYC పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలు నిలిపివేయబడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అందువల్ల అర్హులైన లబ్ధిదారులు వీలైనంత త్వరగా eKYC పూర్తి చేసుకోవాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!