

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల శాతం పెరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో విద్యార్థుల నమోదుపై శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల వాటా 41.40 శాతంగా ఉండగా, 2026-27 నాటికి 42.34 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాల శాతం తగ్గిందని తెలిపారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 2022-23లో 7.6 శాతం, 2023-24లో 3.03 శాతం, 2024-25లో 3.24 శాతం తగ్గాయని, ఈ తగ్గుదల గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగంలో అవకతవకలను అరికట్టడంతో పాటు నకిలీ డేటాను తొలగించినట్లు లోకేశ్ తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!