

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రణాళిక ప్రస్తుతం తమ వద్ద లేదని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో నౌకపై దాడి జరిగినప్పటికీ పరిమిత స్థాయిలో రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. హర్మూజ్ ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం పూర్తిస్థాయిలో కొనసాగుతోందని, సముద్ర జలాల్లోని మందుపాతరలను తొలగించినట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, హర్మూజ్ అమెరికా భూభాగమేనంటూ ఆయన ఓ మ్యాప్‌ను పోస్ట్ చేయగా, ఇరాన్ దీనిని తీవ్రంగా ఖండించింది.
ఇరాన్‌తో సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒమన్‌పై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఒమన్ వైఖరి మారకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సౌదీఅరేబియాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ మద్దతున్న యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ ఘటనపై సౌదీ ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!