
జనరల్

సెంట్రల్ ఆఫ్రికాలోని ఓ బంగారు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. గని ఒక్కసారిగా కుప్పకూలడంతో కనీసం 30 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు గల్లంతయ్యారు. గని శిథిలాలు, మట్టిలో మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులు, బాధితుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గనిలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!