
జనరల్

హైదరాబాద్‌లో నమోదైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటి నిధి అగర్వాల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. బెట్టింగ్ యాడ్‌ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం 21 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలు, చెల్లింపులు, వారి పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిధి అగర్వాల్ విచారణ అనంతరం కేసులో దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!