
క్రీడలు

విశాఖపట్నంలోని కైలాసగిరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. కైలాసగిరిపై రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 65 అడుగుల ఎత్తైన త్రిశూలం, ఢమరుకాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని పేర్కొన్నారు. కైలాసగిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, కొత్తగా నిర్మించిన త్రిశూలం పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేక కేంద్రంగా నిలుస్తుందని నాయకులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!