
సినిమాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాల కారణంగా ములుగు జిల్లాలో గోదావరి నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగపేట మండలం రామన్నగూడెం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు.
పలు గ్రామాల ప్రజలను భద్రతా దృష్ట్యా పునరావాస కేంద్రాలకు తరలిస్తుండగా, వరద నీటితో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!