

ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంభాయ్’ సినిమాలో నటించిన అఖిల్ రాజ్ డెలివరీ కార్మికుడిపై దాడి చేశాడన్న ఆరోపణలను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. తప్పు ఆర్డర్ అందించాడనే కారణంతో కార్మికుడిపై దాడి చేయడం, అవమానించడం జరిగిందని, అలాగే నటుడి తల్లి కూడా కార్మికుడిని అవమానించిందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యూనియన్ పేర్కొంది.
డెలివరీ కార్మికులు కఠిన పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించే శ్రమజీవులని, వారిపై హింస, దౌర్జన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని యూనియన్ స్పష్టం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, గిగ్ కార్మికుల గౌరవం, భద్రతకు హామీ ఇచ్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఒక గిగ్ కార్మికుడిపై దాడి అంటే మొత్తం కార్మిక వర్గంపైనే దాడిగా భావిస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!