

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి ఈ యాగంలో పాల్గొని వేదపండితుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాల్లో ఈ యాగం నిర్వహించబడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యాగం నిర్వహించామని తెలిపారు. ప్రకృతి, వ్యవసాయం, మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయంగా యాగాలు నిర్వహించడం భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!