
బిజినెస్

జీహెచ్ఎంసీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల సరిహద్దులను తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చట్టవిరుద్ధంగా జరిగిందని వారు ఆరోపించారు.
1996 జీవో నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సి ఉండగా, ఆ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషనర్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్-2019లోని సెక్షన్ 6ను కూడా ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!