

ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను తదుపరి చికిత్స కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అనంతరం విమానం సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం దిగిన వెంటనే మచ్చర్‌ను అక్కడి మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సౌదీలోని భారత రాయబార కార్యాలయం గతంలో వెల్లడించింది. తదుపరి వైద్యం కోసం ఇప్పుడు ఆయనను యూఏఈకి తరలించారు.
మరోవైపు, ఘటన సమయంలో మచ్చర్ చూపిన ధైర్యసాహసాలను గుర్తిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్ర పురస్కారం ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల రక్షణ కోసం ఆయన చూపిన ధైర్యాన్ని సీఎం ప్రశంసించారు. స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ గుజరాత్‌లోని ప్రముఖ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు మహామృత్యుంజయ మంత్ర జప అనుష్ఠానాన్ని కూడా ప్రారంభించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!