
జనరల్

అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై చేసిన పిలుపుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించింది. ట్రెజరీ ఆపరేషన్స్, డిజిటల్ బ్యాంకింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అకౌంట్స్ వంటి విభాగాలకు ఈ విధానం వర్తించనుంది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. కస్టమర్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ హైబ్రిడ్ వర్క్ విధానం పనితీరును సమీక్షించిన తర్వాత భవిష్యత్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!