

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారు లక్ష ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికకు కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించినట్లు సంస్థ వెల్లడించింది. తొలుత 50 వేల ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించిన యాజమాన్యం.. తాజాగా మరో 50 వేల ఉద్యోగాల కోతకు కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది పనిచేస్తుండగా, ప్రతిపాదిత కోతలు మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం.
కంపెనీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. జర్మనీలోని నాలుగు ప్లాంట్లను మూసివేసే ప్రణాళికను కూడా వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అధిక వ్యయాలు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ఉద్యోగాల కోత అమలైతే.. ఆటో పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!