

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనపై అనర్హత వేటుకు కీలక ఆధారంగా మారింది. హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది.
మరోవైపు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగిలిన ఎమ్మెల్యేల విషయంలోనూ న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలుకాగా, దానం నాగేందర్‌పై హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో స్పీకర్ ఆయా కేసుల్లో ఫిరాయింపుకు సరిపడే ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై తదుపరి న్యాయపరమైన పరిణామాలు కీలకంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!