

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓఎస్డీగా పరిచయం చేసుకున్న కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తి నలుగురు ఉద్యోగార్థుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై నమ్మకం కలిగించేందుకు నకిలీ ఓఎస్డీ గుర్తింపు కార్డును చూపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను పోలిన నకిలీ పోర్టళ్లను సృష్టించి, ఉద్యోగ నియామక ప్రక్రియ నిజమైనదేనని అభ్యర్థులను నమ్మించినట్లు సమాచారం. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నలుగురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొలుగూరి రవికిరణ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!