

పసిఫిక్ మహాసముద్రంలో అరుదైన బారెల్‌ఐ చేపను శాస్త్రవేత్తలు 4K వీడియోలో చిత్రీకరించారు. పారదర్శకమైన తల, ప్రత్యేకమైన కళ్లతో కనిపించే ఈ వింత సముద్ర జీవిని మోంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (MBARI) చేపట్టిన పరిశోధన యాత్రలో గుర్తించారు. సముద్ర ఉపరితలానికి సుమారు 1,970 అడుగుల లోతులో ఈ చేపను పరిశోధకులు వీక్షించారు. లోతైన సముద్రంలో నివసించే అరుదైన జీవులపై అధ్యయనానికి ఈ దృశ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ చేప తల పూర్తిగా పారదర్శకంగా ఉండటం, దాని లోపల గుండ్రని ఆకుపచ్చ కళ్లు కనిపించడం ప్రత్యేకత. సముద్ర గర్భంలో వెలుతురు చాలా తక్కువగా ఉండే పరిస్థితుల్లో ఆహారాన్ని గుర్తించేందుకు ఈ కళ్లు సహాయపడతాయి. తాజాగా చిత్రీకరించిన 4K ఫుటేజీ ద్వారా బారెల్‌ఐ చేప శరీర నిర్మాణం, ప్రత్యేక లక్షణాలను మరింత స్పష్టంగా పరిశీలించే అవకాశం శాస్త్రవేత్తలకు లభించింది. సముద్ర గర్భంలోని అద్భుతమైన జీవ వైవిధ్యంపై ఈ పరిశోధన మరోసారి ఆసక్తిని పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!