

మురసు తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్ చేశారు. తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని వివరించారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బంది, యంత్రాలు, పరికరాలను ఏపీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విజయ్.. అవసరమైన సిబ్బందిని, యంత్ర సామగ్రిని పంపిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, గతంలో అర్నబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనుల్లో తెలంగాణ విద్యుత్ శాఖ సిబ్బంది ఇప్పటికే పాల్గొంటున్నారు. మురసు తుఫాను వల్ల మరింత నష్టం జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సహకారం పొందేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే కర్ణాటక ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!