
జనరల్

అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హేమంత్ ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల సమయంలో నిందితుడికి గాయాలయ్యాయా? అతడి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. బాలికపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!