

కోర్ అర్బన్ పరిధిలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపు కోసం నవంబర్ 3న లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపునకు ఈ డ్రా తీయనున్నారు. అలాగే, గతంలో 16 నియోజకవర్గాల్లో కేటాయించిన ఫ్లాట్లలో వివిధ కారణాలతో రద్దయిన వాటికి నవంబర్ 4న మాప్ అప్ లాటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గతంలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోనే లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు అనర్హులుగా తేలగా, మరికొందరు నిర్ణీత మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో వారి ఫ్లాట్ల కేటాయింపులను రద్దు చేసి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఇతర అర్హులకు మాప్ అప్ లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ఈ రెండు లాటరీల ప్రక్రియలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇ-లాటరీని యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు గౌతమ్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!