

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలోని యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వైపు కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సంగారెడ్డి డీఎంహెచ్‌వోను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!