
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఖైదీల పునరావాసం, సమాజంలోకి తిరిగి కలిసేలా చేయడంపై చేపట్టిన కార్యక్రమాలకు ఎస్‌కోచ్ అవార్డు దక్కింది. జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా నేతృత్వంలో ఖైదీల సంస్కరణ, పునరావాసం, సామాజిక పునరేకీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు శాఖ వెల్లడించింది.
సంస్కరణ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోని మహిళా ప్రత్యేక జైలు, హైదరాబాద్, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ కేంద్ర కారాగారాల్లో నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినియోగానికి బానిసైన ఖైదీలకు కౌన్సెలింగ్, చికిత్స, పునరావాస సేవలను అందించడమే వీటి లక్ష్యం. డ్రగ్ రహిత తెలంగాణ సాధనకు వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!