27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

Writer: Nithish 06:57 AM, 27 సెప్టెంబర్, 2026
తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డు-2026 లభించింది. జైళ్లలో ‘నివృత్తి’ పేరుతో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాల వినియోగంతో ప్రభావితమైన ఖైదీలకు పునరావాస సేవలు అందిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కింది. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో జరిగిన 109వ స్కోచ్‌ సమిట్‌-ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్యమిశ్రా స్కోచ్‌ ప్రతినిధులు రోహన్‌ కొచ్చర్, సమీర్‌ కొచ్చర్‌ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌’ కార్యక్రమాన్ని జైళ్లలో సమర్థంగా అమలు చేసినందుకు ఈ గుర్తింపు లభించింది.

‘నివృత్తి’ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగంతో ప్రభావితమైన ఖైదీలను తొలిదశలో గుర్తించడం, స్క్రీనింగ్‌, కౌన్సెలింగ్‌, చికిత్స సేవలతో అనుసంధానం చేయడంపై జైళ్ల శాఖ దృష్టి సారించింది. హైదరాబాద్‌, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్‌ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్‌ మహిళా ప్రత్యేక కారాగారంలో డీఅడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 4,200 మంది ఖైదీలను స్క్రీనింగ్‌ చేసి, 2,126 మందికి కౌన్సెలింగ్‌, చికిత్సకు అవసరమైన సహాయం అందించారు. విడుదలైన తర్వాత 300 మంది మాజీ ఖైదీలకు కూడా సహకారం అందించారు. ఖైదీలు వ్యసనాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో జీవితాలను పునర్నిర్మించుకునేలా చేయడమే ‘నివృత్తి’ లక్ష్యమని డా. సౌమ్యమిశ్రా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
ట్యాగ్లు
తెలంగాణ జైళ్ల శాఖస్కోచ్‌ అవార్డునివృత్తివ్యసన విముక్తిజైళ్లలో పునరావాసంసౌమ్యమిశ్రాడీఅడిక్షన్‌ కేంద్రాలుఖైదీల కౌన్సెలింగ్‌మాదకద్రవ్యాల నిర్మూలనదిద్దుబాటు సేవలు
Advertisement

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!