
జనరల్

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా, దుండగులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు నియంత్రణ చర్యగా కాల్పులు జరిపారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున రైళ్లలో దోపిడీలను అడ్డుకునే గస్తీ సమయంలో జరిగింది. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!