
టెక్నాలజీ

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీ జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” ప్రారంభించిన ఈ ఆందోళనలకు విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యులపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువత భవిష్యత్తును దెబ్బతీయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!