

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ జిల్లాలో పేలుడు పదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించిన ఘటన కలకలం రేపింది. రావలమండి ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ద్వారా ఆయుధాలు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఈ ఆపరేషన్‌లో మూడు ప్యాకెట్లలో భారీగా ఆయుధాలు, ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దు మీదుగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎలా చేరాయి? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!