
సినిమాలు

ఈవో అంజనా దేవి తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బాసర ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరించారని ఆమె వెల్లడించారు. బంగారు ముక్కుపుడక, పుస్తెలు వంటి వస్తువులను దొంగలు ముట్టుకోలేదని చెప్పారు. అపహరించబడిన వెండి కిరీటం బరువు సుమారు 1.22 కిలోలుగా ఉందని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి శర్మిల బాసర ఆలయాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. చోరీ ఘటనపై సమగ్ర ఆరా తీశారు. దోషులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!