
జనరల్

జాతీయ గీతం వందేమాతరంకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం 1971 కింద జాతీయ గీతం జనగణమనకు మాత్రమే చట్టపరమైన రక్షణ ఉంది.
తాజా సవరణల ద్వారా అదే తరహా చట్టపరమైన రక్షణను వందేమాతరం గీతానికి కూడా కేంద్రం వర్తింపజేసింది. సవరించిన నిబంధనల ప్రకారం, చట్టంలో నిర్దేశించిన విధంగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతంతో పాటు వందేమాతరం కూడా ఆలపించాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!