
జనరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉద్యోగులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ కుమార్, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడి ప్రభుత్వ నిర్ణయం వల్ల కలిగిన లాభాలను వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!