

భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవల ప్రారంభం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్‌లో స్టార్‌లింక్ అవసరమంటూ ఓ వ్యక్తి ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందించిన మస్క్.. కొందరు గుత్తాధిపత్య శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది భారత ప్రజలకు జరుగుతున్న నేరమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణల్లో తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మస్క్ స్పష్టంగా వెల్లడించలేదు.
మస్క్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ గుత్తాధిపత్య శక్తులు ఎవరో పేర్లు బయటపెట్టాలని మస్క్‌ను కోరారు. భారత ప్రభుత్వంపై ఇంతటి ప్రభావం ఎవరికి ఉందో దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడంతో పాటు గేట్‌వే సైట్లు, యాంటెన్నాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే స్పెక్ట్రమ్, భద్రతా అనుమతులు సహా తుది క్లియరెన్స్‌లు ఇంకా అవసరం కావడంతో వాణిజ్య సేవల ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మస్క్ ఆరోపణల్లో పేర్కొన్న గుత్తాధిపత్య శక్తులు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!