

దేశంలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 1న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు ఉపసంహరణకు గడువు ఉండనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించబడగా, జూన్ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో నాలుగేసి స్థానాలు ఖాళీ కానుండగా, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌లలో మూడేసి స్థానాలు ఖాళీ కానున్నాయి. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మరియు జార్ఖండ్‌లలో ఒక్కో స్థానం ఖాళీ కానుంది. అదనంగా జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఉపఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న ఎంపీలలో 11 మంది బీజేపీకి, నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!