
సినిమాలు

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన రోజే ఆ దేశ సుప్రీం లీడర్ మృతి చెందడంతో అక్కడి పాలనా వ్యవస్థ కూలిపోతుందని అమెరికా భావించింది. కానీ ఆ అంచనాలు నిజం కాలేదు. ఇరాన్ తన సైనిక శక్తితో నిలబడి, అమెరికాను వ్యూహం మార్చుకునేలా చేసింది. దీంతో యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ ప్రయత్నాలు వేగం పెంచినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పెంటగాన్ నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందుతున్న సమాచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జనరల్ డాన్ కెయిన్ అందిస్తున్న వివరాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్షిపణి నిల్వలు తగ్గుతున్నాయనే అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇతర దేశాలతో ఘర్షణలు ఎదురైతే తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!