
జనరల్

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనను బెంగాల్‌లో అడుగుపెట్టనివ్వలేదని, తాను దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కూడా అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తనను రాష్ట్రం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.
తాజా ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేసి పలు విషయాలు వెల్లడించారు. ‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాన్ని కూడా నిషేధించారని, ట్రైలర్ లాంచ్‌ను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తనపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారని, కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గలేదని, తమ కృషికి ఫలితం దక్కిందని ఆయన పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!