
సినిమాలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మొదటి, రెండవ గోపురాల నుంచి ప్రారంభమైన క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం పొందారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. త్రాగునీటి సదుపాయం, కూలర్ల ఏర్పాటు వంటి చర్యలతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈవో బి.కె. వెంకటేశ్వర్లు, చైర్మన్ కొట్టేసాయి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!