
సినిమాలు

జమ్మూ-కాశ్మీర్‌లోని లద్ధా, సమ్రోలి సమీపంలోని ఉదంపూర్-చెనానీ మార్గంలో కొండచరియల స్థిరీకరణ, రహదారి పునరుద్ధరణ పనుల కోసం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44)పై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణికులు, పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
జూలై 18 నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, రాళ్లు జారిపడటం వంటి ఘటనలు చోటుచేసుకుని ప్రయాణం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఈ మార్గాన్ని ఉపయోగించవద్దని, అధికారిక ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!