
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అమరావతి స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రారంభించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. మంత్రి నారాయణ ఆహ్వానించినప్పటికీ పవన్ కార్యక్రమానికి దూరంగా ఉండి ఉదయం విశాఖపట్నం వెళ్లారు.
విశాఖపట్నంలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు హాజరైన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గైర్హాజరు కావడం అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ మూడు కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో ఈ పరిణామంపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!