
జనరల్

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2022 ఏప్రిల్ 1న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్ నిర్వహించారనే ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో అమల్లో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు భట్టి విక్రమార్క విచారణకు హాజరుకాగా, తదుపరి విచారణను న్యాయస్థానం నిర్ణయించిన తేదీన కొనసాగించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!